ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు

తూర్పుగోదావరి జిల్లా సమీపంలో కేంద్రపాలిత యానాంలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదుకావటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 20 పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో యానాం పోలీసులు, అధికారులు అప్రమత్తమయ్యారు.

yanam
యానంలో కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Jul 7, 2020, 5:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండు వారాల క్రితం వరకు 2 కేసులకే పరిమితమైనా.. రెండు రోజుల్లో 20 కేసులు బయటపడటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఇరవై కేసుల్లో రొయ్యల శుద్ధి పరిశ్రమలలో పనిచేసే 12 మంది మహిళలు కాగా.. ఈరోజు కొత్తగా నమోదైన 8 కేసుల్లో అందరూ పురుషులే ఉన్నారు. వీరిలో ఐదుగురు స్థానికంగా ఉండే ఓఎన్జీసీ పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు. మిగిలిన ముగ్గురు హైదరాబాద్ నుంచి వచ్చినవారు. వీరందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

అధికారులు అప్రమత్తం:
రెండు రోజుల వ్యవధిలోనే 20 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో యానాం పోలీసులు..అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితులు నివసించే ప్రాంతాలను హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచారు. 8 గ్రామాలలో రాకపోకలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి అక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు.

ఆరోగ్య శాఖ నివేదిక:
పుదుచ్చేరి ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆదేశాల మేరకు కరోనా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు ఇతర దేశాలు, రాష్ట్రాలు జిల్లాల నుంచి యానా వచ్చిన వారి వివరాలు నమోదు చేస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులు ఆశ కార్యకర్తల ద్వారా తెలుసుకుంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 1200 మందిని హోమ్ క్వారంటైన్ చేశామని.. 40 మంది ప్రభుత్వ క్వారంటైన్​లో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 20 మందికి చికిత్స అందిస్తున్నామని..12 ఏళ్ల బాలుడు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాడని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details