రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిధిలోని రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పాలకవర్గ సమావేశం జరిగింది. కలెక్టర్ మురళీధర్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, అరకు ఎంపీ మాధవి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెండు ఐటీడీఏల అభివృద్ధిపై సుభాష్ చంద్రబోస్ సమీక్ష నిర్వహించారు.
పాలకవర్గ సమావేశానికి 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉందని, కానీ కలెక్టర్ కేవలం మూడు రోజుల ముందు సమాచారం ఇచ్చారని శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా సమావేశం బహిష్కరిస్తున్నానని ఆయన తెలిపారు.