తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం జలవనరుల శాఖ ఎస్ఈ కృష్ణారావు ఇల్లు, కార్యాలయాల్లో అనిశా అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో దాడులు జరిపిన అధికారులు దాదాపు కోటీ 20 లక్షల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. కాకినాడ, రామయ్యపేట, రాజమహేంద్రవరంలోని ఇళ్లు, అతని బంధువులు ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. కర్ణాటకలో 34 సెంట్ల భూమి పత్రాలు, కాకినాడలో 3 స్థలాల అగ్రిమెంట్లు ఉన్నట్లు అనిశా అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: