ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కలెక్టర్ పర్యటన.. అభివృద్ధి పనులపై ఆరా - latest news of east godavari dst collector

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్​తో కలిసి ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆరా తీశారు.

east godavari dst collector visits areas and  intaragate development works
east godavari dst collector visits areas and intaragate development works

By

Published : Jun 6, 2020, 11:42 PM IST

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత గ్రామ సచివాలయ సిబ్బంది పైనే ఉందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అన్నారు. గంగవరం ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత ఉదయభాస్కర్​తో కలిసి పర్యటించారు.

గొరగొమ్మి వెంకటరామపురంలో ఉన్న ఎంపీపీ పాఠశాలలో జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. అనంతరం గంగవరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు పై ఆరా తీశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details