ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కురుస్తున్నందున గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతుంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని లంక ప్రాంతాల్లో పంటసాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వరద నీరు భారీగా చుట్టుముడుతున్న కారణంగా.. వ్యవసాయ ఉత్పత్తులను తెచ్చుకోవడం కష్టతరమవుతోందని ఆవేదన చెందుతున్నారు. వరద తగ్గుముఖం పట్టాలని ప్రార్థిస్తున్నారు.