రాజమహేంద్రవరం నగర కాంగ్రెస్ అభ్యర్ధిగా బోడా వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు, అభిమానులతో తరలివచ్చి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు.
తుని
తుని నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దాడిశెట్టి రాజా మరో నామపత్రం దాఖలు చేశారు. ఇప్పటికే ఆయన నామినేషన్ వేసినప్పటికీ... కాకినాడ ఎంపీ అభ్యర్థి వంగా గీతతో కలిసి ప్రదర్శనగా వచ్చి మరో సెట్ నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అభ్యర్థిగా రాజా అశోక్ బాబు నామినేషన్ దాఖలు చేశారు.
పెద్దాపురం
పెద్దాపురం నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులునామినేషన్లు దాఖలు చేశారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధి తుమ్మల రామస్వామి.. వేలాదిమంది కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వేటుకూరి అమ్మన్న, జనజాగృతి పార్టీ నుంచి కలిదిండి రమణమ్మ, జై భారత్ నేషనల్ పార్టీ తరుఫునగొరకపూడి చిన్నయ్యదొర, రాజ్యాధికారి పార్టీ నుంచి రాయుడు మోజేష్‌బాబు, ప్రజాశాంతి పార్టీ నుంచి కొండేపూడి రవిబాబు నామినేషన్లు దాఖలు చేశారు.
కొత్తపేట