గోదావరి వరదతో పంటలు నీట మునిగాయి. తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని గోదావరి వరద కారణంగా వారం రోజులుగా పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. ఇప్పటికే కూరగాయల తోటలు పూర్తిగా పాడైపోగా.. అరటి తోటలు కుళ్లిపోతున్నాయి. చెట్టు కింద భాగం నీటిలోనే ఉండడంతో కుళ్ళిపోయి ఆకులు పసుపు రంగులో మారి ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద నష్టం..నీటిలో నాని కుళ్లిపోతున్న పంటలు - east godavari dst floods news
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు పూర్తిగా నీటిలోనే మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

due to floods crops in east godavari dst are damaged