స్వీయ నిర్బంధంతో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం మండలం పరిధిలోని దాతలు 22 వేల కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. ముదునూరి సతీష్ రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాన్ని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ ప్రారంభించారు. తన వంతు బాధ్యతగా పేదలకు సహాయం చేసిన సతీష్ రాజును ఎమ్మెల్యే ప్రశంసించారు.
వికసించిన మానవత్వం.. పరిమళించిన దాతృత్వం
కరోనా లాక్డౌన్ వేళ ఎంతో మంది హృదయంలో మానవత్వం పరిమళిస్తోంది. ఆపన్నులను ఆదుకునేందుకు ఎందరో దాతలు ముందుకొస్తున్నారు. తమ సహాయ సహకారాలతో ఎన్నో వేల కుటుంబాలను ఆదుకుంటున్నారు.
due-to-corona-lockdown-distribution-of-vegetables-in-polavaram-in-east-godavari