ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ - ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు

కరోనా వైరస్ నివారణ చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విపత్తు సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను కాపాడ్డానికి ప్రభుత్వం చేపట్టే చర్యలకు దాతలు, సంస్థలు తమ వంతు సాయం అందిస్తున్నారు.

west godavari district
ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ

By

Published : May 5, 2020, 5:17 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలో వివిధ సంస్థలు, దాతలు పదిహేను లక్షల రూపాయల పైగా విరాళం అందజేశాయి. విరాళాల చెక్కులను నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస నాయుడుకు ప్రతినిధులు అందజేశారు.
* పెరవలి మండలం తీపర్రుకు చెందిన కెవీవీఎస్ఎన్ అసోసియేట్స్ తరఫున కుందుల వీర వెంకట సత్యనారాయణ 6 లక్షల రూపాయలు ఇచ్చారు.
* నిడదవోలు మండలం పురుషోత్తపల్లి కి చెందిన శ్రీ వెంకటేశ్వర ఆక్వా ఫాం తరఫున ముళ్ళపూడి శ్రీనివాస్ చౌదరి, శంకరపల్లి శ్రీ హరిలు 6 లక్షల రూపాయలు అందజేశారు.
* తీపర్రుకు చెందిన భోగవల్లి సత్యనారాయణ 2 లక్షల రూపాయలు ఇచ్చారు.
* బూరుగుపల్లి రాము లక్ష రూపాయలు ఇచ్చారు.
* సిరిపురపు వీర వెంకట సత్యనారాయణ 30 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

దాతలకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details