73 ఏళ్ల మంగాయమ్మ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడంపై వైద్యుడు ఉమాశంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం గుంటూరులోని అహల్యా ఆసుపత్రిలో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి మంగాయమ్మ రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. కృత్రిమ గర్భధారణ కోసం ఆమె వచ్చినప్పుడు తామంతా ఆశ్చర్యపోయామని అన్నారు. అన్ని రకాల పరీక్షలు చేశాక వైద్యం ప్రారంభించామని... వైద్యుల మొదటి ప్రయత్నంలోనే కృత్రిమ గర్భధారణ విజయవంతమైందని తెలిపారు. ఆహారం తీసుకోవడంలో ఆమె ఇబ్బందులు పడ్డారని ఉమా శంకర్ చెప్పారు. నిపుణులైన వైద్యులు ఆమెను నిత్యం పర్యవేక్షించారని వెల్లడించారు. ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని ఉమాశంకర్ తెలిపారు. ప్రసవానికి వెళ్లే ముందు మంగాయమ్మ కోరిక మేరకు శ్రీమంతం చేసినట్లు తెలిపారు.
'కృత్రిమ గర్భధారణ కోసం మంగాయమ్మ వస్తే ఆశ్చర్యపోయా' - ahalya
73 ఏళ్ల మంగాయమ్మ ఆత్మవిశ్వాసమే ఆమెను తల్లిని చేసిందని వైద్యుడు ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. నిత్యం వైద్యులు పర్యవేక్షిస్తూ... ఆమె మొహంలో ఆనందాన్ని నింపారని... వైద్య రంగంలోనే కొత్త చరిత్ర సృష్టించామని అన్నారు.
మంగాయమ్మ వైదుడు మీడియా సమావేశం
'ఈ విజయం వైద్య రంగానిది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఈ ఘనత సాధించటం నాకు మరింత సంతోషం. నాకు వైద్య విద్య నేర్పిన గురువులకు ఈ రికార్డు అంకితం చేస్తున్నాను'- ఉమా శంకర్, వైద్యుడు