ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న క్యాంటీన్లపై మంత్రి పిల్లి సుభాష్ ఏమన్నారంటే? - godavari flod areas

అన్న క్యాంటీన్ల విషయంలో మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టత ఇచ్చారు. వాటిని మూసివేయడం జరగదని... మూడు రోజుల్లో పని చేస్తాయని వెల్లడించారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పిల్లి సుభాష్

By

Published : Aug 2, 2019, 4:07 PM IST

గోదావరి వరద ప్రభావిత గ్రామాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఉప ముఖ్యమంత్రి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. 2 జిల్లాల్లోని అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్నారు . గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించినట్లు ఆయన తెలిపారు. అక్కడ నివసిస్తున్న వారికి అవసరమైన నిత్యవసర వస్తువులు అందించామన్నారు. అన్నాక్యాంటీన్లు మూసివేయబోమని...అన్నీ రెండు, మూడు రోజుల్లో పని చేస్తాయని స్పష్టం చేశారు. జూలై 30న ద్రవ్య వినియోగ బిల్లు ఆమోదం పొందిందని...చెల్లింపుల విషయంలో ఇక ఎలాంటి సమస్య ఉండబోదని హామీ ఇచ్చారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పిల్లి సుభాష్

ABOUT THE AUTHOR

...view details