తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన గర్భిణీ బొడ్డు సునీతను ఆటోలో మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి నొప్పులు తీవ్రత ఎక్కువ కావటంతో.. వేగంగా వారు ఆసుపత్రికి చేరుకుని విషయం డాక్టర్ హేమలతకు తెలిపారు. దీంతో ఆమె పరుగున వెళ్లి ఆసుపత్రి ఆవరణలో ఉంచిన ఆటోలొనే చికిత్స అందించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆమె తెలిపారు.
ఆస్పత్రికి వచ్చేలోపే పురిటి నొప్పులు..ఆటోలోనే ప్రసవం - east godavari dst latest news
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆటోలో ఆసుపత్రికి వస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే ఆమె బంధువులు సమాచారమివ్వగా... ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు హేమలత ఆటోలోనే పురుడు పోసి తల్లీబిడ్డను కాపాడారు.
delivery to a pregent in auto at east godavari dst by a doctor