తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో వశిష్ఠ బోటు ప్రమాదంలో మరణించిన మరో రెండు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు. వీటితో పాటు మరో రెండు మృతదేహాలు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం లభ్యమయ్యాయి. మృతులు హైదరాబాద్‌కు చెందిన దంపతులు పవన్‌కుమార్, భవానీలుగా తెలిసింది. దీంతో ఈ దుర్ఘటనలో ఇంతవరకూ 38 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. గోదారి ఒడ్డున మృతదేహాలను ఖననం చేయాలని బంధువులు నిర్ణయించారు.
బోటు ప్రమాదంలో.. మరో రెండు మృతదేహాలు గుర్తింపు - గోదావరి బోటు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మరో రెండు మృతదేహాలను వారి బంధువులు గుర్తించారు.
బోటు ప్రమాద మృతదేహాలను గుర్తించిన బంధువులు