పోలీసులు, అటవీశాఖ అధికారులకు ఈ సమాచారం తెలుసుకుని గ్రామానికి వచ్చారు. చిరుతను పట్టుకోవాలని అధికారులంతా సమన్వయం చేసుకున్నారు. గుడిసె పైన, చుట్టూ పటిష్ఠమైన వలలు కట్టారు. చిరుత పారిపోయేందుకు ఆస్కారం లేకుండా వలపన్నారు . డాటింగ్ ప్రక్రియ ద్వారా తుపాకీతో మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ దాని ప్రభావం చిరుతకు పనిచేయలేదు. చాలా ప్రయత్నాలు తర్వాత రాత్రి 11 గంటలకు అధికారులు చిరుత పులిని బంధించారు.
ఈ దృశ్యాలను చూసేందుకు చుట్టు ప్రక్కల నుంచి జనం ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వీరిని అదుపు చేయడం పోలీసులకు అదనపు శ్రమను కలిగించింది. చిరుతకు ఎలాంటి హాని జరగకుండా అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.