వ్యవసాయ చట్టాల్ని ఏడాదిన్నరపాటు వాయిదా వేయడమంటే.. రైతులకు ఉరి శిక్ష వాయిదా వేయడమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీపీఐ సంఘీభావ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రామకృష్ణతోపాటు మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యవసాయ చట్లాల్ని అమలు చేస్తే రైతులకు ఉరి వేసినట్టేనంటూ ప్రదర్శన నిర్వహించారు.
'వ్యవసాయ చట్లాల్ని అమలు చేస్తే రైతులకు ఉరి వేసినట్టే' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్లాల్ని అమలు చేస్తే రైతులకు ఉరి వేసినట్టేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సీపీఐ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సంఘీభావ సదస్సు నిర్వహించారు.

వ్యవసాయ చట్లాల్ని అమలు చేస్తే రైతులకు ఉరి వేసినట్టే
రైతులకు మద్దతుగా ఈ నెల 26న జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్, ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహిస్తామని రామకృష్ణ తెలిపారు. వ్యవసాయ చట్టాల్ని పూర్తిగా రద్దు చేసి రైతులకు మేలు చేయాలని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి అభిప్రాయపడ్డారు. చట్టాలు రద్దు చేయాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. చట్టాల అమలు వాయిదా వేయడం శుభపరిణామని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు.
ఇదీ చదవండి:అధికారులపై చర్యలు కోరుతూ సీఎస్, డీజీపీకి ఎస్ఈసీ లేఖ