ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పూర్తి ప్యాకేజీ చెల్లించకుండా.. గ్రామాలను ఎందుకు ఖాళీ చేయాలి?' - సీపీఐ డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్ తాజా సమాచారం

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ చెల్లించాలని.. సీపీఐ డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్ డిమాండ్ చేశారు. సొమ్ము ఇవ్వకుండా ఖాళీ చేయమనటం దారుణమన్నారు.

CPI division secretary Juttuka Kumar
పూర్తి ప్యాకేజీ చెల్లించకుండా.. గ్రామాలను ఎందుకు ఖాళీ చేయాలి

By

Published : Jan 24, 2021, 7:49 AM IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో ప్యాకేజీ చెల్లించకుండా.. గ్రామాలను ఖాళీ చేయాలనటం దారుణమని సీపీఐ డివిజన్ కార్యదర్శి జుత్తుక కుమార్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం గుబ్బలంపాడు గ్రామాన్ని సందర్శించిన ఆయన నిర్వాసితులతో మాట్లాడారు.

గ్రామాలు ఖాళీ చేయాలంటూ వచ్చిన తహసీల్దార్ ను అడ్డుకున్నారు. ఎందుకు ఖాళీ చేయాలని ప్రశ్నించారు. ప్రస్తుతం నిర్మించిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవని ఆగ్రహించారు. అర్హత ఉన్న నిర్వాసితులు.. అందరికీ పూర్తి స్థాయి ప్యాకేజీ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details