ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి - east godavarai corona cases

తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజూకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకూ 49 వేల 245 కేసులు వెలుగుచూశాయి.

covid extracting continues in East Godavari district.
తూర్పుగోదావరి జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి

By

Published : Aug 24, 2020, 12:32 PM IST

తూర్పుగోదావరి జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. పీడితులను ఆసుపత్రుల పాల్జేస్తోంది. ప్రాణాలను సైతం హరిస్తోంది. గడప దాటాలంటే బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది. కరోనా కట్టడికి అధికారులు శ్రమిస్తున్నా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు.

జిల్లాలో ఇప్పటివరకూ 49 వేల 245 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసులు 17 వేల 228 ఉన్నాయి. 31వేల 691 మంది కోలుకున్నారు. తాజాగా.. నాలుగు మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 326కు చేరినట్లు రాష్ట్ర కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ విభాగం ప్రకటించింది. జిల్లాలో రోజూ వెయ్యికి తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నట్టు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details