ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీహెచ్​సీల్లో పరీక్షలు.. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ప్రతాపం చూపుతోంది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కరోనా నివారణ చర్యలను ముమ్మరం చేశారు. జిల్లాలోని ఊబలంక, చొప్పెల్ల పీహెచ్​సీల్లో నిర్వహించిన కరోనా నిర్థరణ పరీక్షల్లో 19 మందికి కరోనా పాజిటివ్ తేలింది.

corona tests conduct in east godavari district phc
కరోనా పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

By

Published : Jul 29, 2020, 8:43 AM IST

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 మంది గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఆలమూరు మండలంలోని చొప్పెల్ల పీహెచ్​సీలో 43 మందికి కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా.. 15 మందికి వైరస్ సోకినట్లు వైద్యాధికారి సుమలత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details