ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ముమ్మిడివరం నియోజకవర్గంలో కరోనా ఉద్ధృతి

By

Published : Jul 15, 2020, 1:00 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో రోజూ 150 పైబడి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కేసులు గ్రామాలకు విస్తరించాయి. ఇతర రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి స్వస్థలం చేరుకున్న వారి ద్వారానే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతోందని అధికారులు అంటున్నారు.

corona positive cases increasig in east godavari dst mummidivaram consistency
corona positive cases increasig in east godavari dst mummidivaram consistency

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. జిల్లాకు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అధికారులు అప్రమత్తమై సంబంధిత గ్రామాలను రెడ్​జోన్లుగా ప్రకటిస్తూ ఆంక్షలను విధిస్తున్నారు. జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు, ఐ పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన, నాలుగు మండలాల్లో అమెరికా, తెలంగాణ, కర్ణాటక , మహారాష్ట్ర నుంచి స్వగ్రామం వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు బయట పడ్డాయి.

వీరి ద్వారా కుటుంబ సభ్యులకే కాక ఇతరులకు వైరస్​ సోకింది. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామాలను రెడ్ జోన్లు గా ప్రకటించి పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రతి మండలంలోనూ ఐదు నుంచి పది గ్రామాలు కంటైన్మెంట్ చేయటంతో రోజువారి జీవనం సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అనుమానితుల నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించిన వారం రోజుల వరకు ఫలితాలు వెలువడక పోవడంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోంది.


ఇదీ చూడండి

విశాఖ‌ దుర్ఘటన: మృతుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి

ABOUT THE AUTHOR

...view details