ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టు గూళ్లు కొనేవారే కరవయ్యారు...ఆదుకోండి' - chebrole latest news

కరోనా ఎఫెక్ట్ పట్టు ఉత్పత్తి రైతులపై ప్రభావం చూపుతోంది. ఎంతో వ్యయ ప్రయాసలతో కష్టపడి పండించిన పట్టుగూళ్లు కొనే వారే కరవయ్యారని చేబ్రోలులో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టు పరిశ్రమకు గూళ్లు తీసుకెళ్తుంటే కొనుగోలు చేసే రీలర్లు రావడం లేదని పట్టు పరిశ్రమ అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

silk production
'పట్టు గూళ్లు కొనేవారే కరవయ్యారు...ఆదుకోండి'

By

Published : Jul 27, 2020, 1:39 AM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తాము కష్టపడి పండించిన పట్టు గూళ్లు కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేబ్రోలులో పట్టు పరిశ్రమ కు గూళ్లు తీసుకెళ్తుంటే కొనుగోలు చేసే రీలర్లు రావడం లేదని పట్టు పరిశ్రమ అధికారులు చెబుతున్నారని రైతులు అంటున్నారు..సుదూర ప్రాంతంలో ఉన్న మార్కెట్ కి తరలించి అమ్ముకోవాలని అధికారులు అంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.. పండించిన గూళ్లు కరోనా వంటి కష్ట కాలంలో ఇతర జిల్లాలు కు తరలించి ఎలా అమ్ముకోగలం అని రైతులు ప్రశ్నిస్తున్నారు... స్థానిక మార్కెట్ లోనే రైతులు కు అమ్ముకొనే వెసులుబాటు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి-కరోనా బాధితురాలిని ఆసుపత్రిలో చేర్చుకోని సిబ్బంది...పరిస్థితి విషమం

ABOUT THE AUTHOR

...view details