తూర్పు గోదావరి జిల్లాలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులో రాష్ట్రంలో అత్యధికంగా 1210 మందికి కొవిడ్ సోకింది. కాకినాడలో వైరస్ విజృంభిస్తోంది. నగరంలో 305, గ్రామీణ మండలంలో 86, రాజమహేంద్రవరం నగరంలో 184, గ్రామీణంలో 77మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. కడియం మండలంలో 67, పిఠాపురం 43, యు.కొత్తపల్లి 28, సామర్లకోట 27, తాళ్లరేవు 26, కరప మండలంలో 22 మందికి కొవిడ్ సోకింది. పెద్దాపురం, అనపర్తి, కాజులూరు, రామచంద్రపురం, రౌతులపూడి, గొల్లప్రోలు, కపిలేశ్వరపురం, మండపేట, తొండంగి తదితర మండలాల్లోనూ పదుల సంఖ్యలో కొత్తగా వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో కరోనా బారిన పడి 7గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 129కి చేరింది.
జిల్లాలో కొత్తగా 1210 పాజిటివ్ కేసులు.. ఏడుగురు మృతి - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కల్లోలం వీడటంలేదు. గడిచిన 24 గంటల్లో 12 వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జిల్లాలో కొవిడ్ విస్తృతి మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
corona cases