ఈ నెల 21న తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడవరం నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుక నిర్వహించనుంది. ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్న ఈ సభకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముమ్మిడివరం మండలం గాడి లంకలో హెలికాప్టర్ దిగేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. కొమానపల్లిలో నిర్వహించే బహిరంగ సభకు పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయం 4 వేల నుంచి పదివేలకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఈనెల 21 ముమ్మిడివరంలో సీఎం సభ.. విస్తృత ఏర్పాట్లు
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈనెల 21న తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నిర్వహించే సభకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
cm jagan tour of eastgodavari on november 21