గోదావరి బోటు ఘటనపై సీఎం జగన్ అధికారులను ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఫోన్లో మాట్లాడారు. సమగ్ర సమాచారన్ని అందించాలని అధికారులకు సూచించారు. పర్యటక మంత్రి శ్రీనివాస్ ఘటనాస్థలానికి బయల్దేరి వెళ్లారు. రెండు సహాయక బోట్లను ప్రమాదస్థలికి తరలించారు. రాజమహేంద్రవరం నుంచి హెలికాప్టర్ బయల్దేరింది. నీటి ఉద్ఢృతి తదితర విషయాలపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.
బోటు ప్రమాదంపై సీఎం ఆరా... తక్షణ సహాయక చర్యలకు ఆదేశం
తూర్పుగోదావరి జిల్లా గోదావరి బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ అధికారులను ఆరా తీశారు.
తక్షణమే స్పందించాలని సీఎం ఆదేశం
దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగినట్లు సమాచారం. 62 మంది పర్యటకులతో పాపికొండలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పర్యటకులు లైఫ్ జాకెట్లు ధరించినట్లు సమాచారం. 14 మందిని తూటుగుంట గ్రామస్థులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మరో 10 మంది ఒడ్డుకు చేరారు. ఇప్పటివరకు ఒక మృతదేహం లభించింది.
ఇవీ చదవండి...గోదావరిలో పర్యటక బోటు మునక
Last Updated : Sep 15, 2019, 4:03 PM IST