సాధారణంగా బత్తాయి, సీతాఫలాల్లో మనకు విత్తనాలు కనిపిస్తాయి. కానీ కాయల్లో విత్తనాలే లేని ఆ రకాల వంగడాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని నర్సరీ నిర్వాహకులు చిలుకూరి నరేష్. ఆయన థాయ్‌లాండ్ తదితర ప్రాంతాల నుంచి ఈ రకం మొక్కలను తెప్పించి అంట్లు కట్టి వాటి సంఖ్యను పెంచారు. ప్రస్తుతం అవి కాయలు కాస్తున్నాయి.
దీనిపై ప్రాంతీయ ఉద్యానశాఖాధికారి సుధీర్ మాట్లాడుతూ... విత్తనాలు లేని ఈ కాయలను తిరుపతిలోని చీనిబత్తాయి పరిశోధన కేంద్రం వారు పరిశీలిస్తారని చెప్పారు. ఆ పండ్లలోని షుగర్ లెవెల్స్, పోషకాలు, మినరల్స్ ఎంత మోతాదులో ఉన్నాయో వారు పరీక్షించి చెబుతారని వెల్లడించారు.