'చేసిన అభివృద్ధే... ఈ ఆదరణకు కారణం' - maganti roopa
రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్లాలంటే తెదేపాకు ఓటేసి గెలిపించాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి మాగంటి రూప వ్యాఖ్యానించారు.
మాగంటి రూప ప్రచారం
By
Published : Mar 29, 2019, 7:20 PM IST
మాగంటి రూప ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి మాగంటి రూప, నిడదవోలు అసెంబ్లీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేశారని రూప అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు హారతులు పట్టి... స్వాగతం పలుకుతున్నారన్నారు.దీనికి చంద్రబాబు చేసిన అభివృద్ధే కారణమని అన్నారు.