రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి పోకడలు రోజు కూలీలు, నిర్మాణ రంగ కార్మికులకు దీపావళి పండుగ లేకుండా చేశాయని తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నూతన విధానం తెచ్చి రెండు నెలలవుతున్నా ఇసుక సమస్య తీరలేదని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇసుక కొరత సమస్య రోజురోజుకూ క్లిష్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లక్షల మందికి పైగా కార్మిక కుటుంబాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారని చంద్రబాబు నిలదీశారు.
'ఇసుక కొరత సమస్య రోజురోజుకూ క్లిష్టం చేశారు' - ఇసుక సమస్యపై చంద్రబాబు
వైకాపా ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను ఇంకా జఠిలం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. రోజు కూలీలకు, నిర్మాణ రంగ కార్మికులకు దీపావళి పండుగ లేకుండా చేశారని మండిపడ్డారు.
ఇసుక కొరతపై చంద్రబాబు ట్వీట్