రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడారు. 27 మంది ఖైదీల్లో 19మంది జైలుకు వచ్చే నాటికే తమకు జబ్బు ఉందని ముందుగా తెలియజేశారని, మిగిలిన 8 మంది మాత్రం చెప్పలేదన్నారు. ముందుగా తెలిపిన వారికి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 8 మందికి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వైద్య పరీక్షల్లో వారికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలిందన్నారు. వీరికి కూడా మందులు అందిస్తున్నట్టు వివరించారు. వారు కూడా అందరిలాగానే పనిచేసుకుంటారని... వారికి వైద్యుల సూచనల మేరకు మందులు, ఆహారం అందిస్తామని చెప్పారు. కోర్టుకు ఇదే విషయం అందిస్తున్నట్లు తెలిపారు.
రాజమహేంద్రవరం కారాగారంలో 27 మంది ఖైదీలకు హెచ్ఐవీ - diet
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
సూపరింటెండెంట్