తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని సంజయ్‌నగర్ రాజీవ్ గృహకల్ప 32వ బ్లాక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా ఉపాధి లేక... కుటుంబ పోషణ భారమై ఈ ఘటనకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కనువిప్పు కలగదా: చంద్రబాబు
ఇసుక మాఫియాకు కార్మికులు బలవుతున్నా ముఖ్యమంత్రి జగన్‌కు కనువిప్పు కలగదాఅని తెదేపా అధినేతచంద్రబాబు ప్రశ్నించారు. కాకినాడలో కార్మికుడు వీరబాబు ఆత్మహత్య బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. ప్రభుత్వనిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలి కావాలని మండిపడ్డారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాకినాడలో భవన నిర్మాణ కార్మికుడు మృతి
ఇవీ చదవండి..ఎప్పుడు కూలుతుందో తెలియదు... ఎలా పని చేయాలి?