ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చివరికి దశకు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌..

ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ రోజు మధ్యాహ్నానికి లెక్కింపు పూర్తి కానుంది. అభ్యర్థి ఇళ్ల వెంకటేశ్వరరావు విజయం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అధికార ప్రకటన మాత్రమే రావలిసి ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయి.

By

Published : Mar 28, 2019, 11:11 AM IST

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ తుది దశకు చేరుకున్నాయి.

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ప్రథమ ప్రాధాన్యతా ఓటు లెక్కింపుతోనే విజేత నిర్ణయం కానుంది. పీడీఎఫ్ బలపరచిన ఇళ్ల వెంకటేశ్వరరావు విజయం దాదాపుగా ఖాయమైంది. ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. ఇంకా నాలుగు రౌండ్లు మిగిలి ఉండగానే వెంకటేశ్వరరావు కోటా ఓట్లు సాధించినట్లు సమాచారం. ఇప్పటివరకూ లెక్కింపు పూర్తయిన 24రౌండ్లలో ఇళ్ల వెంకటేశ్వరరావు 85వేల 326 ప్రథమ ప్రాధాన్యతా ఓట్లు దక్కించుకున్నారు. మొదట్నుంచీ అన్ని రౌండ్లలోనూ ఎక్కువ మొత్తంలో ఓట్లు ఐవీ కైవసం చేసుకుంటూ వచ్చారు. ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి 34వేల 506ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నానికి పూర్తి కానుంది.

ABOUT THE AUTHOR

...view details