వెంకటేశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు - darshan
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
వాడపల్లి భక్తుల రద్దీ
ఏడు శనివారాల నోము చేసే భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తారు. ఏడు ప్రదక్షిణలు చేసిస్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని వారి నమ్మకం.
దేవాలయానకి పెద్ద సంఖ్యలో భక్తులు వలనశ్రీనివాసుని దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అన్నపానీయాల సదుపాయాన్ని కల్పించారు.