తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో అవేర్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ మాధవన్ పర్యటించారు. మారేడుమిల్లి మండలం వుత్తలూర్, పందిరిమామిడికోట, కొత్త కాలనీ తదితర గ్రామాలను మాధవన్ సందర్శించి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో అవేర్ సంస్థ ఛైర్మన్ పర్యటన
తూర్పుగోదావరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో అవేర్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ మాధవన్ పర్యటించారు. గిరిజనులు తమ సమస్యలు తెలుపగా.. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తూర్పుగోదావరి జిల్లాలో అవేర్ సంస్థ ఛైర్మన్ పర్యటన
తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు తెలుపగా.. చేతిపంపులు, బోరుబావులు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. అవేర్ సంస్థ జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్, సిబ్బంది హిమబిందు, రాధిక.. తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అంతర్వేది ఆలయంలో ఫిబ్రవరి 19 నుంచి ఉత్సవాలు