బీరు సీసాతో యువకుడి గొంతుకోసిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు వద్ద చోటు చేసుకుంది. కొందరు దుండగులు ప్రదీప్ కుమార్ అనే యువకుడి గొంతుకోశారు. ప్రస్తుతం బాధితుని పరిస్థితి విషమంగా ఉంది. అతనికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువకుడిని ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ కిశోర్ తెలిపారు.
బీరు సీసాతో యువకుడిపై దాడి..పరిస్థితి విషమం - attack
తూర్పూగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లాలాచెరువు వద్ద యువకుడిపై బీరు సీసాతో దాడి జరిగింది. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దాడి