ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపడుతున్నాం' - sucharita

ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సత్వర సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలు చేస్తున్నామని హోమంత్రి సుచరిత తెలిపారు. సహయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత

By

Published : Aug 4, 2019, 9:14 PM IST

హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత

ఉభయ గోదావరి జిల్లాల్లో సత్వర సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నట్లు హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి సుచరిత తెలిపారు. రెండు జిల్లాల్లో 280 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ, పునరావాస పనులను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఎన్డీఆర్ఆఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహయక చర్యలో పాల్గొన్నయన్న హోంమంత్రి... క్షేత్రస్థాయిలో సహాయ చర్యల కోసం విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా రూ.2 కోట్లు విడుదుల చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details