తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. ఏజెన్సీలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే తమ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బకాయి ఉన్న వేతనాలు, అలవెన్సులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోయారు.
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతాం: ఆశా వర్కర్లు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వచ్చేనెల 4వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకుంటే 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆశా వర్కర్లు హెచ్చరించారు.
asha workers protest at rampa chodavaram
సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర నాయకురాలు మట్ల వాణిశ్రీ అన్నారు. వచ్చేనెల 4వ తేదీ లోపు సమస్యలు పరిష్కరించకుంటే 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు లేఖలు ఇచ్చామన్నారు.
ఇదీ చదవండి: 2023 మార్చి నాటికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్: సీఎం జగన్