ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేది ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు - అంతర్వేది ఆలయ ఈవో సస్పెండ్ న్యూస్

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఈవో చక్రధర్​పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ పరిసరాల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవటం తప్పిదమని ఉత్తర్వుల్లో పేర్కొంది.

anthrvedhi eo chakradarrao suspended
anthrvedhi eo chakradarrao suspended

By

Published : Sep 8, 2020, 11:21 PM IST

Updated : Sep 9, 2020, 1:04 AM IST

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనలో దేవస్థానం ఈవో ఎన్​. ఎస్. చక్రధర్​పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

దేవాలయ పరిసరాల పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడం తప్పిదమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తప్పించినట్టు దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.

Last Updated : Sep 9, 2020, 1:04 AM IST

ABOUT THE AUTHOR

...view details