తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీవో మల్లిబాబు అన్నారు. కత్తిపూడి పరిసర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో సూచించారు. ఇటీవల ఒక వ్యక్తికి కరోనా సోకిన కారణంగా.. అతని కుటుంబసభ్యుల నమూనాలు సేకరించినట్టు చెప్పారు. 30 మంది నమూనాలు సేకరించగా ఐదుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారణైందని ఆర్డీవో తెలిపారు.
కత్తిపూడిలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు - Another five corona positive cases in Kuttipadi
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడిలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కత్తిపూడిలో మరో 5 కరోనా పాజిటివ్ కేసులు
TAGGED:
ఆర్డీవో మల్లిబాబు