తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఈ ఉత్సావాలకు తెరతీశారు. పెళ్లి పెద్దలుగా సీతారాముల వారి సమక్షంలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా చేసిన అనంతరం ముత్తైదువులు పసుపు దంచారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవం జరిగింది.
ఇదీ చదవండి..