పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని తన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రవర్తనా నియమావళి అమలు, పోలింగ్ నిర్వహణ, కొవిడ్ నిబంధనలు పాటించటం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిబంధనలు అతిక్రమించిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు.
'ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటించాలి'
పంచాయతీ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ అన్నారు. పట్టణంలోని తన కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
అధికారులతో అమలాపురం సబ్ కలెక్టర్ సమావేశం