తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అధికారులు జాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేశారు. కాకినాడ నగరం, గ్రామీణ మండలం, రాజమహేంద్రవరం మండలాలతో పాటు కోనసీమలోను ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.
రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో.. ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయలను మాత్రం నిబంధనల మేరకు అనుమతించారు. ప్రజలంతా కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కలెక్టర్ మురళీధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.