ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉభయ గోదావరి జిల్లాలో డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 77.76 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారని విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు తెలిపారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో 22,573 మంది విద్యార్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయగా.. వారిలో 17,552 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత శాతం 77.76గా ఉందన్నారు. ఆయా కోర్సుల వారీగా వివరాలు వెల్లడించారు.
ఆర్ట్స్‌లో బీఏ, బీఏ ఒకేషనల్ కోర్సులలో 1,752 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా.. 313 మంది ఉత్తీర్ణులయ్యారని.. ఉత్తీర్ణత శాతం 74.94గా ఉందన్నారు. కామర్స్‌లో బీకామ్, బీకామ్ కంప్యూటర్స్ కోర్సులలో 6,619 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా.. 5427 మంది ఉత్తీర్ణులయ్యారని.. ఉత్తీర్ణత శాతం 81.99గా ఉందని తెలిపారు. సైన్స్‌లో బీఎస్సీ, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ యానిమేషన్, బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులలో 13,223 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా.. 9,915 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రొఫెషనల్ కోర్సులలో బీబీఏ, బీసీఏలో 979 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 897 మంది ఉత్తీర్ణులయ్యారని ఉత్తీర్ణత శాతం 91.62గా ఉందని చెప్పారు. సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించి సకాలంలో పరీక్ష ఫలితాలను అందించిన విశ్వవిద్యాలయ పరీక్ష విభాగానికి వీసీ అభినందనలు తెలియజేశారు.
ఇవీ చదవండి..
రైతులకు కష్టం వస్తే సీఎంకు పట్టదా ..?: నారా లోకేశ్