ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం మత్తులో దాడి.. బాలుడి మృతి - ప్రొద్దుటూరు తాజావార్తలు

పాత కక్షలు బాలుడి నిండు ప్రాణం బలిగొన్నాయి. మద్యం మత్తులో దాడి చేయటంతో బాలుడు మరణించిన ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది.

young person died
హత్యకు గురైన యువకుడు

By

Published : Apr 22, 2021, 10:41 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో పాత గొడవలు హత్యకు దారి తీశాయి. మద్యం మత్తులో కత్తితో బాలుడిపై ఓ యువకుడు దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఏం జరిగింది:

పట్టణంలోని సంజీవనగర్​కు చెందిన పూజారి కార్తిక్(14)పై అదే ప్రాంతానికి చెందిన జొన్నల కార్తిక్ అనే యువకుడు గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న జొన్నల కార్తిక్ .. కత్తితో పూజారి కార్తిక్ పై దాడి చేశాడు. వీపు భాగంలో బలమైన గాయమవటంతో పూజారి కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గొడవ ఆపేందుకు వెళ్లిన సాగర్​ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:బావిలో అధ్యాపకుడి మృతదేహం..అసలేం జరిగింది..?

ABOUT THE AUTHOR

...view details