మద్యం తాగి పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ.. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం వేములకొండ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో జరిగింది.
వేములకొండ ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గంగరాజు.. పాఠశాలకు సరిగా రావడం లేదని, ఒకవేళ వచ్చినా మద్యం సేవించి(vemulakonda school teacher drinking alcohol) వస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు.