మురికివాడల్లో బాలలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను గుర్తించిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ.. మురికివాడల్లో నివసిస్తోన్న బాలలను గుర్తించి వారికి సాయమందిస్తోంది. వారితో ఆదివారం గడిపి అవసరమైన ఆటపాటలు, పోషకాహారం అందిస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి చేయూత సంస్థ అధ్యక్షుడు మొండి రవికుమార్ టీమ్ శ్రీకారం చుట్టింది.
మేము సైతం అంటూ.. ఎన్నెన్నో సామాజిక కార్యక్రమాలు
కాకినాడకు చెందిన చేయూత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మొండి రవికుమార్ ఆధ్వర్యంలో సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో వేలాది నిరుపేదలు, కూలీలు, కార్మికులు, వలస కార్మికులు, హిజ్రాలు, అభాగ్యులకు మూడు నెలల పాటు నిరంతరం ఆహారం అందిస్తూ కడుపునింపుతూ దాతృత్వాన్ని చాటుకున్నారు.
చిన్నారుల ఆనందం కోసం "చేయూత" చిరు దీపం లాక్డౌన్ కాలంలో విశేష సేవలు..
లాక్డౌన్తో ఉపాధి, కూలి పనులు లేక ఆర్థికంగా ఇక్కట్లకు గురవుతున్న నిరుపేదలకు అవసరమైన బియ్యం, నిత్యవసర వస్తువులు, పండ్లు కాయకూరలను చేయూత సంస్థ సభ్యులు అందిస్తూ విశేష సేవలందించారు. వేసవిలో రక్తం నిల్వల కొరతతో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన చేయూత సంస్థ ప్రత్యేక చొరవతీసుకుని జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించింది.
చిన్నారుల ఆనందం కోసం "చేయూత" చిరు దీపం చదువుకు పేదరికం అడ్డుకాదు..
విద్యార్థులు, యువకుల నుంచి వందలాది యూనిట్ల రక్తం బాటిల్స్ సేకరించి తలసేమియా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపారు. చదువుకోవాలన్న కోరిక ఉండి.. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో నిరుపేద విద్యార్థులకు స్కాలర్స్ అందిస్తూ విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. పలు రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వైద్యం, శస్త్ర చికిత్సల కోసం లక్షలాది రూపాయలు అందించి ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో బాధితులకు ఆర్థిక సహకారం అందించి ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
చిన్నారుల ఆనందం కోసం "చేయూత" చిరు దీపం ప్రకృతి సిద్ధంగా..
సహజసిద్ధంగా పండించిన కాయగూరలు, ధాన్యం ఉత్పత్తి చేసే రైతులను ప్రోత్సాహించేందుకు చేయూత సంస్థలో ఉన్న సభ్యులంతా ఏడాదికి అవసరమైన ప్రకృతి సిద్దంగా ఎలాంటి క్రిమి సంహారక మందులు వేయకుండా పండించిన పంట ఉత్పత్తులను నేరుగా రైతుల వద్దకే వెళ్లి కొనుగోలు చేసి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చేయూత సంస్థ సభ్యులు సమాజంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటుకుంటున్నారు.
మురికివాల్లో చిన్నారుల కోసం చిరుదీపం..
బాల్యం దశలో చిన్నారులంతా ఆనందంగా.. ఆరోగ్యంగా ఉండాలన్న ధ్యేయంతో చేయూత సంస్థ.. చిన్నారుల కోసం చేయూత- చిరుదీపం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలుత కాకినాడ స్మార్ట్ సిటీలో వేర్వేరు చోట్లలోని 8 మురికివాడల్లో నివసిస్తోన్న చిన్నారులను గుర్తించారు. చిన్నారుల ముఖాల్లో ఆనందం చూడటం కోసం వారి ఆకాంక్షల మేరకు చిన్న చిన్న సంతోషకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జి వద్ద నూకాలమ్మ మాన్యం వద్ద చిరుదీపం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
తల్లిదండ్రులకు వివరణ..
ముందుగా చిన్నారుల తల్లిదండ్రులందర్నీ ఒకచోటకి చేర్చి చిన్నారుల కోసం తమ సంస్థ చేపడుతున్న కార్యక్రమాన్ని వివరించారు. బాల్యం ఎంతో ముఖ్యమైనదని, చిన్నారుల బాల్యాన్ని చేజేతులా కాలరాయడం మంచిదికాదని సూచించారు. విద్యార్జన ద్వారానే సమాజంలో నెలకొన్న అంతరాలు సమసిపోతాయని, ప్రతీ చిన్నారిని చదివించాలని అవగాహన కల్పించారు. విద్య ప్రాధాన్యతపై సవివరంగా తల్లిదండ్రులకు వివరించారు.
ప్రతీ ఆదివారం..
చిరుదీపం కార్యక్రమం ప్రారంభంలో భాగంగా ప్రతీ ఆదివారం చిన్నారులకు అవసరమైన పోషకాహారాన్ని అందించాం. విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనాలు చేశాం. విద్యార్థుల అభిరుచులను అడిగి తెలుసుకున్నాం. ప్రతీ ఆదివారం బాలలందర్నీ ఒకే చోటకు చేర్చి పోషకాహారంతో పాటూ చదువు చెప్తాం. సంస్థ సభ్యుల కుటుంబాల పుట్టినరోజు, వివాహాది, శుభకార్యాలను ప్రతీ ఆదివారం ఇక్కడ చిన్నారుల మధ్య నిర్వహించేలా చిరు దీపం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.
చిన్నారుల ఆనందం కోసం "చేయూత" చిరు దీపం - చిన్నారుల ఆనందరం కోసం చిరుదీపం..
మొండి రవికుమార్, అధ్యక్షుడు, చేయూత
కాకినాడ 86397 27476
ఇవీ చూడండి : ఏపీ ఈసెట్ 2020: వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల