గంజాయి స్వాధీనం... ఆరుగురి అరెస్ట్ - crime
రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం నేషనల్ హైవేపై 40 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
'అన్నవరం జాతీయరహదారిపై 40కేజీల గంజాయి స్వాధీనం'
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. 30 ప్యాకెట్లలో తరలిస్తున్న 40 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని.. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సన్యాసిరావు తెలిపారు.