ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలో చేరిన 200మంది వైకాపా కార్యకర్తలు - eleswaram political news

తెదేపాలో నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్​ఛార్జ్ వరుపుల రాజా అన్నారు. ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో సుమారు 200 వందల మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.

200 ysrcp activist joined in to tdp at east godavari
200 ysrcp activist joined in to tdp at east godavari

By

Published : Mar 4, 2021, 9:09 AM IST

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో సుమారు 200 వందల మంది వైకాపా కార్యకర్తలు.. తెదేపాలో చేరారు. ఆ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్​ఛార్జ్ వరుపుల రాజా.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

భద్రవరం మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాశీపు నూకాపతిరావు, స్థానిక నాయకుడు బందిలీ అంకాలు.. తెదేపాలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని వరుపుల రాజా వారికి భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details