ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులు ప్రవర్తించాలని రాయలసీమ వైకాపా ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో తిరుపతిలో సమావేశాన్ని నిర్వహించారు. రాయలసీమ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతంరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా, జిల్లాలోని పార్టీ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'ఎస్ఈసీ ఆదేశాలు పాటిస్తే చర్యలే.. ఎన్నికల నియమావళి ప్రకారం నడవాలి' - ఏపీ పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు
అధికారులు ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎస్ఈసీ ఆదేశాలను పాటిస్తే చర్యలకు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎస్ఈసీపై వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, ఎస్ఈసీ వ్యవహారం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి.. తెదేపాకు లబ్దిచేకూర్చేలా ఎస్ఈసీ ప్రవర్తన ఉందన్నారు. అధికారులు నియమనిబంధనల ప్రకారం నడచుకోవాలి తప్ప.. ఎస్ఈసీ ఆదేశాలను పాటిస్తే చర్యలకు ఉపక్రమిస్తామని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు
Last Updated : Feb 6, 2021, 2:50 PM IST