ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండుటెండలో మందుబాబులు బారులు! - చిత్తూరులో మద్యం దుకాణాలు

మద్యం దుకాణాలు తెరుచుకున్న వేళ మందుబాబులు గొంతు తడుపుకోవడానికి క్యూ కట్టేస్తున్నారు. మండుటెండను కూడా లెక్కచేయట్లేదు.

wine shops
wine shops

By

Published : May 4, 2020, 4:57 PM IST

నెలకుపైగా మూతపడిన మద్యం దుకాణాలు.. ఇవాళ తెరుచుకోవడంతో మద్యం ప్రియులు మండుటెండను కూడా లెక్కచేయట్లేదు. కొనుగోలు చేయడానికి క్యూ కట్టేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఎక్సైజ్ శాఖ పరిధిలోని 19 మద్యం దుకాణాలను తెరిచారు.

ఉదయం 11 గంటల నుంచి మద్యం విక్రయాలు ప్రారంభిస్తారని ప్రభుత్వం ప్రకటించగా... మద్యం ప్రియులు ఉదయం 9 గంటల నుంచే దుకాణాల వద్ద మకాం వేశారు. ప్రభుత్వం నుంచి ధరల సమాచారం రావడం ఆలస్యం కావడంతో గంటపాటు విక్రయాలు జరగలేదు. మదనపల్లె పట్టణంలో ఏ లిక్కర్ దుకాణం ఎదుట చూసినా మందుబాబులు క్యూ దర్శనమిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details