చిత్తూరు జిల్లా ఊట్లవారి పల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుమారు కోటి రూపాయల వ్యయంతో తితిదే నిర్మించిన వసతి సముదాయ భవనాన్ని బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న దేవాలయాలకు కావలసిన సౌకర్యాలు త్వరలో సమకూరుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సామాన్య ప్రజలకు అతి తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం అయ్యేట్లు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తామన్నారు.
'తితిదే ఆధీనంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తాం' - develop all temples under TTD
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి సహకరిస్తామని తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. సామాన్య ప్రజలకు శ్రీవారి దర్శనం తక్కువ సమయంలో అయ్యే విధంగా కృషి చేస్తామన్నారు.
తితిదే ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి