ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో తితిదే ఉద్యోగి ఆత్మహత్య

తిరుపతిలో తితిదే ఉన్నతోద్యోగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తిరుపతిలోని గోవిందరాజుల సత్రం - 2లో సూపరింటెండెంట్ హోదాలో విధులు నిర్వహిస్తోన్న ఉమాశంకర్ రెడ్డి ఆదివారం రాత్రి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఐడీ కార్డు ఆధారంగా పోలీసులు మృతదేహం తితిదే ఉద్యోగిదిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. ఉమాశంకర్ రెడ్డి ఆత్మహత్యకు ఉద్యోగపరమైన ఒత్తిళ్లు కారణమా...లేదా వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TTD employee suicide in tirupati
తిరుతిలో తితిదే ఉద్యోగి ఆత్మహత్య

By

Published : Feb 24, 2020, 11:40 PM IST

తిరుపతిలో తితిదే ఉద్యోగి ఆత్మహత్య

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details