తిరుపతి నగర వాసులకు మంచినీరు అందించే అమృత్ పథకం పనులను త్వరగా పూర్తి చేయాలని.. వేసవి కాలంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు, అమృత్ పథకం గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు.
'ప్రతి ఇంటికి కుళాయి ... వద్దంటే సేవలు బంద్' - తిరుపతి వార్తలు
తిరుపతిలో మంచినీరు అందించే అమృత్ పథకం పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష ఆదేశించారు. అక్రమ కనెక్షన్లు తొలగించడంతో పాటు అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయాలని.. వద్దన్న వారికి నగరపాలక అందిస్తున్న అన్ని సేవలు నిలిపి వేయాలని ఆదేశించారు.
తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష
అమృత్ పథకంలో జరుగుతున్న మంచినీటి, భూగర్భ మురికినీటి పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేయాలని.. వద్దన్న వారికి నగరపాలక అందిస్తున్న అన్ని సేవలు నిలిపి వేయాలన్నారు. అక్రమ కనెక్షన్లు తొలగించడంతో పాటు అపరాధ రుసుం వసూలు చేయాలన్నారు. నగరంలో పర్యటించి తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :కుప్పంలో.. తెదేపా బ్యానర్లకు నిప్పుపెట్టిన దుండగులు